Buchi Babu: RC 16 సినిమాపై బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్ 1 y ago
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్. RC 16 (వర్కింగ్ టైటిల్) పేరుతో రూపొందుతోంది. తాజాగా 'బాపు' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్యఅతిథిగా బుచ్చిబాబు హాజరవ్వగా రామ్ చరణ్ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్ చేశారు. "మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ఆయన మా నుంచి భౌతికంగా దూరమై ఏడాది అవుతోంది. 'ఉప్పెన' సినిమా విడుదల సమయంలో ఆయన చేసిన పని ఇంకా గుర్తుంది. థియేటర్ గేట్ బయట నిలబడి 'సినిమా బాగుందా” అని వచ్చిన వారందరినీ అడిగేవారట. నేను ప్రస్తుతం తీస్తున్న రామ్చరణ్ సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది" అని చెప్పారు.